అర్నబ్ తుపాను బీభత్సం: రూ.4,764 కోట్ల నష్టం జరిగిందంటూ కేంద్ర బృందానికి నివేదిక

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

అర్నబ్ తుపానుతో రాష్ట్రంలో రూ.4,764 కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక రూపొందించి కేంద్ర బృందానికి అందించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 26 నుంచి మూడు రోజుల పాటు 16 జిల్లాల్ లో అర్నబ్ తుపాను పెను బీభత్సం సృష్టించిందని, వ్యవసాయ పంటలు దెబ్బతినడంతో పాటు వేర్వేరు ఘటనల్ లో 9 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర బృందం నివేదికలో స్పష్టం చేసింది.