మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మసీదు తొలగింపు వివాదంపై రాళ్లు రువ్వి ఘర్షణ
రిపోర్టర్: నరేష్
స్థలం: ఉజ్జయిని
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణలో భాగంగా షాహీ మసీదు తొలగింపును నిరసిస్తూ జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. టాంకీ చౌక్ ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి, బాూద్ గ్యాస్ ప్రయోగించి గుంపును చెదరగొట్టారన్నారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఏడు కేసులు నమోదు చేసి పదిహేను మందిని అరెస్టు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.