పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలంటూ అధికారులకు కలెక్టర్ ఆదేశం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, వంటశాల నిర్మాణాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో నాణ్యమైన ఆహారం అందించాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.