ఉత్తరాఖండ్ ఫారెస్ట్ అకాడమీ హాస్టళ్లలో విద్యార్థులకు ఉచిత వసతి
రిపోర్టర్: సునీల్
స్థలం: ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో ఉన్న ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ట్రైనింగ్ అకాడమీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పర్యావరణ అధ్యయనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థుల కోసం అకాడమీ హాస్టళ్లలో ఉచిత బస సౌకర్యాన్ని కల్పించింది. అకాడమీ డైరెక్టర్ సంజీవ్ చతుర్వేది వెల్లడించిన ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 16న ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం ఈ సదుపాయం ప్రభుత్వ సంస్థల విద్యార్థులకు 15 రోజుల పాటు ప్రయోగాత్మక ప్రాతిపదికన మయూరి హాస్టల్ లో అందుబాటులో ఉంటుంది.