గోవాలో రష్యన్ పౌరుడు ఆత్మహత్య

రిపోర్టర్: అశోక్ స్థలం: గోవా

గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో 27 ఏళ్ల రష్యన్ జాతీయుడు పావెల్ లెంస్కీ అద్దె గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం కోల్పోవడం మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు స్నేహితుడు రోమన్ రైబిన్కిన్ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.