నిరుద్యోగులకు రూ.1.3 లక్షలు బాకీ.. ప్రభుత్వంపై పువ్వాడ నిప్పులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. నెలకు రూ.4,000 చొప్పున మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం రూ.1.30 లక్షలు బాకీ పడిందని ఆయన మండిపడ్డారు.
100 రోజుల్లో జాబ్ క్యాలెండర్, ఏటా 2 లక్షల ఉద్యోగాల పేరుతో యువతను మోసగించారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 16 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చిందని, మిగిలినవన్నీ గత ప్రభుత్వ హయాంలోనివేనని ఆయన స్పష్టం చేశారు.