రష్యాలో ఉగ్రదాడి కుట్ర భగ్నం: మైనర్‌ను అరెస్ట్ చేసిన ఫెడరల్ సెక్యూరిటీ
రిపోర్టర్: సునీల్
స్థలం: Moscow
మాస్కోలోని సారిట్సినో పార్కులో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఒక మైనర్‌ను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అరెస్టు చేసింది. అమెరికా అందించిన నిఘా సమాచారంతో ఈ అరెస్టు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడి ఫోన్ లో హింసాత్మక దాడులకు సంబంధించిన సామాగ్రిని గుర్తించినట్లు ఎఫ్ఎస్బి పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ భద్రతా సహకారంలో ఇదొక అరుదైన పరిణామమని రష్యా వర్గాలు వెల్లడించాయి.