గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన వంటనూనెల జాబితా వెల్లడించిన నిపుణులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

గుండె ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల వంట నూనెలను ఆరోగ్య నిపుణులు నిఖిల్ జాకట్కర్ తాజాగా ర్యాంక్ చేశారు. గుండెకు అత్యంత ప్రయోజనకరమైన నూనెగా ఆలివ్ ఆయిల్కు ఆయన మొదటి స్థానం కల్పించారు. మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉండే ఆలివ్ ఆయిల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సాంప్రదాయ వంటకాలకు ఆవనూనె, వేరుశనగ నూనె కూడా మంచివేనని, అయితే నూనెను వాడే విధానం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.