తెన్కాశిలో శరవేగంగా ఆల్మోస్ట్ నల్లవన్ సినిమా రెండో షెడ్యూల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: తమిళనాడు

కోలీవుడ్ నటి దుషారా విజయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ఆల్మోస్ట్ నల్లవన్. రాజు జయమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం తెన్కాశి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోందని దుషారా విజయన్ వెల్లడించారు.