సినిమాలను ప్రాంతాల వారీగా విభజించడం సరికాదంటూ సీనియర్ నటుడు నరేష్ వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

సినిమాలను తెలంగాణ, రాయలసీమ అంటూ ప్రాంతాల వారీగా విభజించడం సరికాదని సీనియర్ నటుడు వీకే నరేష్ అభిప్రాయపడ్డారు. గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాషా భేదాలు లేకుండా ఇతర భాషల చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు తెలుగు సినిమాలను విడదీయడం తగదన్నారు. మట్టి వాసన ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, సినిమాను సినిమాగానే చూడాలని ఆయన స్పష్టం చేశారు.