ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రంలో గాండల్ఫ్ గా ఇయాన్ మెక్కెలెన్ రీఎంట్రీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది హంట్ ఫర్ గొల్లమ్ చిత్రంలో గాండల్ఫ్ ది గ్రే పాత్రలో ప్రముఖ నటుడు ఇయాన్ మెక్కెలెన్ మరోసారి కనిపించనున్నారు. ఈ సినిమా సెట్స్ నుంచి ఆయన ఫస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పీటర్ జాక్సన్ తెరకెక్కించిన ఒరిజినల్ ట్రాలజీలో అద్భుత నటనతో అలరించిన ఇయాన్ మెక్కెలెన్, దశాబ్ద కాలం తర్వాత ఈ భారీ ఫాంటసీ చిత్రంతో మళ్లీ వెండితెరకు వస్తుండటం విశేషం.