రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అదుపుపై దేశవ్యాప్తంగా నిరసనల హోరు

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi / Maharashtra

న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ మహారాష్ట్రలోని కల్యాణ్-డోంబివిలిలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కి పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రజాస్వామ్య హణనానికి పాల్పడుతున్నారని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.