కుప్పానికి నీళ్లొస్తే పాలమూరుకు ఎందుకు రావు అంటూ రేవంత్ పై బీఆర్ఎస్ ఫైర్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

శ్రీశైలం నుంచి కుప్పానికి కృష్ణా నీళ్లు వెళ్తున్నా పాలమూరుకు నీళ్లు రాకపోవడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టెక్ సెల్ తీవ్రంగా నిలదీసింది. తెలంగాణలో వాటర్, పవర్ మేనేజ్‌మెంట్ లేదని, కేవలం ముప్పై శాతం కమిషన్ మేనేజ్‌మెంట్ మాత్రమే నడుస్తోందని మండిపడింది. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో కూరుకుపోయిందని ఆరోపించింది.