భారత్ ఏ జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ నియామకం: బీసీసీఐ వెల్లడి

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

ఖతార్ వేదికగా జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీ కోసం ప్రకటించిన భారత్ ఏ జట్టుకు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. రజత్ పటిదార్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ, రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారని, ఈ నెల 20న నేపాల్ తో భారత్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుందని అధికారులు తెలిపారు.