పార్టీ లైన్ దాటితే సహించేది లేదంటూ మంత్రి నారా లోకేశ్ హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కాదని, ప్రతి నేత క్రమశిక్షణతో పని చేయాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ గీత దాటితే సహించేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా యాభై వేల మంది కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు.