మోకాళ్ల నొప్పులపై వైద్యుల హెచ్చరిక: ఎక్స్-రేలతోనే సర్జరీలు సరికాదని స్పష్టీకరణ
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
మోకాళ్ల నొప్పులతో బాధపడే ప్రతి ఒక్కరికీ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం లేదని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు రాకేష్ రాజ్పుత్ మరియు బరుణ్ దత్తా స్పష్టం చేశారు. ఎక్స్-రేలలో కనిపించే ఎముకల రాపిడి ఆధారంగా మాత్రమే వైద్యం నిర్ణయించలేమని వారు తెలిపారు. నొప్పుల తీవ్రత, రోగి జీవనశైలిని బట్టి ఫిజియోథెరపీ, కండరాల వ్యాయామాలతోనూ ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడించారు.