ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 29 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా సాధారణ ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఆలస్య రుసుముతో గడువు కల్పించారు. 2027 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.