కడప హింసాకాండపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Kadapa

కడప, పులివెందులలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా ఓటు హక్ కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులను ఎన్నికల అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరని లోకేశ్ హెచ్చరించారు. ఈ ఘటనలపై ఎన్నికల సంఘానికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.