అవతార్ సినిమాతో రాకా చిత్రాన్ని పోల్చలేదన్న అల్లు అర్జున్ మేనేజర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రం రాకాపై వస్తున్న అవతార్ సినిమా పోలికలపై మేనేజర్ శరత్ చంద్ర నాయుడు స్పష్టతనిచ్చారు. తమ కోర్ టీమ్ ఎప్పుడూ ఈ సినిమాను ఇతర గొప్ప చిత్రాలతో పోల్చలేదని, కంటెంట్ తనంతట తానుగా మాట్లాడుతుందని ఆయన స్పష్టం చేశారు.