సింగరేణిలో అవినీతి కుంభకోణాలు బట్టబయలు: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు

రిపోర్టర్: విజయ్ స్థలం: Godavarikhani

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా కాంగ్రెస్ సర్కార్పై పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గోదావరిఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల వల్ల బొగ్గు ఉత్పత్తి పడిపోయిందని మండిపడ్డారు. నైనీ కుంభకోణంతో పాటు పలు స్కాములపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశామని, అవినీతి అంకెలను ప్రజల ముందుంచామని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.