ఆదోనిలో గణేష్ నిమజ్జన భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆదోని

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పరిశీలించారు. ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌తో పాటు చిన్న హరివాణం ఎల్లెల్సీ కాలువ నిమజ్జన ఘాట్‌ను ఆయన పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు.