బెల్లంపల్లిలో బీజేపీ మహిళా మోర్చా ఇన్చార్జి సంగీతకు ఘన సన్మానం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ నిర్మల్ జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జిగా నియమితులైన న్యాయవాది నల్లుల సంగీతను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి ఆమె చేసిన కృషిని గుర్తించి బాధ్యతలు అప్పగించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు.