నగరిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరి మండలం వికెఆర్ పురం శ్రీకృష్ణ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.