విజయవాడ రైల్వేస్టేషన్లో భారీగా డ్రగ్స్ కలకలం: యువతి అరెస్ట్

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయవాడ

విజయవాడ రైల్వేస్టేషన్లో ఈగల్ మరియు జీఆర్పీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నాగసౌమ్య అనే యువతి వద్ద పదకొండు లక్షల రూపాయల విలువైన నూట పది గ్రాముల ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్స్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. జైలులో ఉన్న తన ప్రియుడిని బెయిల్పై విడుదల చేయించేందుకు ఆమె బెంగళూరు నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.