కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ నేతల తీరును ఎండగట్టిన కేసీఆర్
రిపోర్టర్: మహేష్
స్థలం: Telangana
రంగనాయక సాగర్ పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలను విజయవంతంగా ఎత్తిపోస్తున్నామని, ఈ అద్భుతాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు కండ్లు పెద్దగా చేసి చూడాలని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లోని నాలుగో మోటార్ ద్వారా మూడు వేల మూడు వందల క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నామని పేర్కొంటూ ఎక్స్ వేదికగా కీలక వివరాలను పంచుకున్నారు.