దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

దిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. నోయిడా వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ డంపర్ ట్రక్ రోడ్డు పక్కన ఆగి ఉన్న క్రేన్, ఆటోరిక్షాను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఉమేష్, ప్రవీణ్, సూరజ్, అనూప్ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం డంపర్ డ్రైవర్ పరారయ్యాడు.