స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల జీవోలు రద్దు: హైకోర్టు కీలక తీర్పు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించిపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ జారీచేసిన జీవో నూట ఐదు, పురపాలక శాఖ జారీచేసిన జీవో పదిహేనులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.