టాలీవుడ్కు రెండు కళ్లు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు: నిర్మాత దిల్ రాజు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ల లాంటివని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, అనుబంధాలను ప్రతిబింబించేలా కొత్త సినిమాలు వస్తున్నాయని, యువత ప్రతిభతో టాలీవుడ్ స్థాయి మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.