టాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్ట్: పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు సినిమా
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అర్జున అనే పేరుతో ఈ పాన్ ఇండియా యాక్షన్ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని సినీ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.