స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి జాతీయ గుర్తింపు
రిపోర్టర్: రాము
స్థలం: గుంటూరు
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో గుంటూరు నగరపాలక సంస్థ జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో దేశవ్యాప్తంగా 130 నగరాలతో పోటీపడి గుంటూరు రెండో స్థానం దక్కించుకుంది. నగరంలో ఈ-ఆటోల వాడకం, మెషిన్ల ద్వారా రోడ్ల శుభ్రత, సమర్థ వ్యర్థాల నిర్వహణతో కాలుష్యం భారీగా తగ్గింది. ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ చేతుల మీదుగా గుంటూరు కమిషనర్ ఈ అవార్డును అందుకున్నారు.