బీసీ సంక్షేమ సంఘం ఇన్చార్జిగా బండారి నరేష్ బాధ్యతలు స్వీకరించారు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మరియు నిజామాబాద్ రూరల్ ఇన్చార్జిగా బండారి నరేష్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు, సంఘం బలోపేతానికి ఈ నియామకం చేపట్టినట్లు వారు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నరేష్ బాధ్యతలు చేపట్టడం వల్ల సంఘం మరింత పటిష్టంగా మారుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.