పిఠాపురంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు: పదివేల మందికి శ్రావణ కానుక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కాకినాడ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో శ్రావణ మాసం సందర్భంగా పదివేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలను కానుకగా పంపిణీ చేశారు. పాదగయ క్షేత్రంలో జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో ఎమ్మెల్యే నానాజీ, శివశ్రీనివాసరావు తదితరులు పాల్గొని పంపిణీ చేపట్టారు. వరుసగా మూడో ఏడాది పవన్ కల్యాణ్ తరపున ఈ కానుకలు అందజేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.