హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు: రసాయనాలతో కూడిన చికెన్ పదార్థాలు జప్తు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హనుమకొండ

హనుమకొండ జిల్లాలో ఆహార భద్రతా విభాగం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రసాయనాలు కలిపిన చికెన్ మరియు ఇతర హానికర పదార్థాలు పట్టుబడ్డట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 36 కేసులు నమోదు చేయగా, అందులో 22 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.