హోంమంత్రి అనిత సొంతగడ్డపై వైసీపీ హవా: ఎంపీటీసీ స్థానాల్ లో ఘన విజయం
రిపోర్టర్: సతీష్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని అధికారులు తెలిపారు. నక్కపల్లి ఒకటి, రెండు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు కల్పన, బంగార్రాజు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత తన ఓటు హక్ కు వినియోగించుకున్న నక్కపల్లి రెండు స్థానంలోనూ వైసీపీ అభ్యర్థే విజయం సాధించడం గమనార్హం. సొంతగడ్డపైనే అధికార కూటమికి ఎదురుదెబ్బ తగలడంతో రాజకీయ వర్గాల్ లో తీవ్రంగా చర్చ సాగుతోంది.