తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదన్న సిట్

రిపోర్టర్: హరి స్థలం: తిరుపతి

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ మరియు ఈడీ సంయుక్త దర్యాప్తులో స్పష్టమైంది. నెయ్యిలో రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాల కల్తీ జరిగినట్లు నిర్ధారించినా, జంతు కొవ్వు కలిసిందంటూ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.