పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోంది: బూరుగుపల్లి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తూర్పు గోదావరి
నిడదవోలు నియోజకవర్గంలో పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతగానో అండగా నిలుస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు స్పష్టం చేశారు. వేలివెన్ను క్యాంపు కార్యాలయంలో 59 మంది లబ్ధిదారులకు రూ.26.31 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్వోసీ పత్రాన్ని ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.