నెల్లూరు జిల్లాలో అరుదైన ఘటన: శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి పరిధిలోని మనుబోలు బీసీ కాలనీ సమీపంలో ఉన్న శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. శివలింగం చుట్టూ మూడు నాగుపాములు ప్రదక్షిణ చేసినట్లు స్థానికులు మరియు భక్తులు తెలిపారు. పూజల అనంతరం ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు. ప్రదక్షిణలు ముగిసిన తర్వాత ఆ నాగుపాములు సమీపంలోని పుట్టలోకి ప్రశాంతంగా వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.