వరంగల్ ఆసుపత్రి పనుల జాప్యంపై సీఎం రేవంత్ ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు ఆలస్యం కావడంపై ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. వచ్చే ముప్పై రోజుల్లో ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరం పనులు కొనసాగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ఆదేశించారు.