తీర ప్రాంతాల్లో ఎస్పీ మహేశ్వర రెడ్డి ముందస్తు సహాయక చర్యల పరిశీలన
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో అధికారుల అప్రమత్తత పెరిగింది. తీర ప్రాంతాలు మరియు పునరావాస కేంద్రాలలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి ముందస్తు ఏర్పాట్లు, సహాయక చర్యలను పరిశీలించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.