డీఎస్సీ స్పోర్ట్స్ కోటా స్కాంపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

కూటమి ప్రభుత్వంలో శాంతియుతంగా ధర్నా చేయాలన్నా యుద్ధానికి వెళ్లినట్టు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని వైయస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల అమ్మకానికి ట్రైల్ రన్ లా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా స్కాం చేశారని ఆయన ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామని, దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు.