కూటమి సర్కార్ తీరుపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మాధవరావు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు తనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, స్టాఫ్ లేదా సెక్యూరిటీని కూడా కేటాయించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తీవ్రంగా స్పష్టం చేశారు.