మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ: మోహన్‌లాల్‌తో నటి భాగ్యశ్రీ బోర్సే
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
మలయాళ చిత్ర పరిశ్రమలోకి నటి భాగ్యశ్రీ బోర్సే అడుగుపెడుతున్నట్లు నటి వెల్లడించారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆపరేషన్ గంగా సినిమాతో ఆమె మాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నానని, షూటింగ్లో ప్రతి రోజూ ఎంతో నేర్చుకుంటున్నానని భాగ్యశ్రీ పేర్కొన్నారు. విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఆమె స్పష్టం చేశారు.