ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్పై అశుతోష్ రాణా తీవ్ర నిప్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అశుతోష్ రాణా స్పష్టం చేశారు. అక్రమ నిర్బంధం తర్వాత విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని తలపించేలా వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి తప్పుకునే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.