ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి పిలుపు
రిపోర్టర్: మహేష్
స్థలం: జూలూరుపాడు
గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని ప్రస్తుత తరుణంలో కూలీలు ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి స్పష్టం చేశారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ మేట్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రానున్న రోజుల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని, పొలాల్లో పంట కుంటలు నిర్మించుకోవాలని సూచించారు.