దారుణం: మద్యం మత్తులో కన్న కొడుకును గొంతు నులిమి చంపిన తండ్రి
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
హైదరాబాద్ లోని బోరబండలో మద్యం మత్తులో విద్యాసాగర్ అనే వ్యక్తి తన ఐదేళ్ల కుమారుడు విజయ్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శిల్పినగర్ లో రాత్రి ఈ దారుణం జరిగినట్లు పేర్కొన్నారు. క్యాటరింగ్ పనికి వెళ్లి తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చిన బాలుడి తల్లి దుర్గ విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.