నర్సీపట్నాన్ని కోట్లాది రూపాయలతో సమగ్రంగా అభివృద్ధి చేసింది వైఎస్సార్సీపీయే
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు వెచ్చించి సమగ్రంగా అభివృద్ధి చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకుంటూ సంక్షేమ ధ్యేయంతో ముందుకు సాగామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగించినట్లు నాయకులు పేర్కొన్నారు.