మర్రిపాడు మండలంలో రెండవ రోజు జోరుగా నామినేషన్ల స్వీకరణ

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలం పదమూడు ఎంపీటీసీ స్థానాలకు రెండవ రోజు ఇరవై ఎనిమిది నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మొదటి రోజు రెండు నామినేషన్లు రాగా నేటితో కలిపి మొత్తం ముప్పై నామినేషన్లు వచ్చాయి. వీటిలో వివిధ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారుల పర్యవేక్షణలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.