అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సీఎన్ఎన్ తో పాటు ప్రముఖ మీడియా సంస్థల దావా

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో కొత్త హెలిప్యాడ్‌ను ప్రారంభించిన కార్యక్రమం వివాదాస్పదమైంది. శ్వేతసౌధంలోకి సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి ప్రముఖ మీడియా సంస్థలను ట్రంప్ నిషేధించడంతో, దానికి నిరసనగా ఏబీసీ, సీబీఎస్, ఫాక్స్ న్యూస్, ఎన్బీసీ తదితర ఛానెళ్లు ఉమ్మడి టెలివిజన్ పూల్ కవరేజీని నిలిపివేశాయి. అంతేకాకుండా తమను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ ఆ మూడు మీడియా సంస్థలు వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులో ట్రంప్ యంత్రాంగంపై దావా వేశాయి.