విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హ్యాపీ జర్నీ సినిమా
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
దర్శకుడు అభిరామ్ నాయుడు తెరకెక్కించిన హ్యాపీ జర్నీ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏడుగురు మహిళలు యూరప్ ట్రిప్‌కు వెళ్లిన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, వంశీ, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో నటించారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఎమోషనల్ కామెడీ జర్నీ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల రివ్యూలు వస్తున్నాయి.