బాలు సినిమా పవన్ ప్యాంట్ వెనుక రహస్యం బయటపెట్టిన రేణు దేశాయ్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన బాలు చిత్రంలో ఆయన ధరించిన ప్రత్యేకమైన ప్యాంట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా వెల్లడించారు. ఆ ప్యాంట్ రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వస్త్రంతో తయారైందని, ప్రపంచంలో అలాంటివి కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. లండన్ లోని ప్రముఖ మాల్ లో పవన్ కోసం తాను దుస్తులు కొనుగోలు చేసేదానినని ఆమె గుర్తుచేసుకున్నారు.